News October 25, 2024
నేటి నుంచి పశుగణన
AP: నేటి నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు 21వ అఖిల భారత పశు గణన చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 21,173 గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పశువుల వివరాలను నమోదు చేయనున్నట్లు పేర్కొంది. గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, వివిధ రకాల కోళ్లు, పక్షులతో సహా 16రకాల పెంపుడు జంతువులపై జాతుల వారీగా సమాచారాన్ని సేకరించనుంది. పశు గణనను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు.
Similar News
News November 13, 2024
నామినేషన్ దాఖలు చేసిన RRR
AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉప సభాపతి పదవికి RRR ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.
News November 13, 2024
ఎల్లుండి నుంచి ICICI క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్
* క్యాష్ అడ్వాన్స్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు 3.75%
* రూ.101-500 పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.100
* రూ.50వేల పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.1300
* రూ.100లోపు బిల్లు విషయంలో ఎలాంటి లేట్ ఫీజు ఉండదు
* ఎడ్యుకేషన్ విషయంలో థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులకు 1% ఛార్జీ వర్తింపు
* స్కూల్/కాలేజీకి నేరుగా పేమెంట్ చేస్తే ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.
News November 13, 2024
ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలి: అనిత
AP: సొంత చెల్లి, తల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోతే, తాము అరెస్ట్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘మహిళలను ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు. కానీ జగన్ సీఎం ఉన్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో జగన్ ఆలోచించుకోవాలి’ అని ఆమె సూచించారు.