News September 15, 2024
రూ.2 లక్షలపైన రుణమాఫీ.. సీఎం కీలక ప్రకటన
TG: రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోపల రూ.2 లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తాడిచెట్టులా పెరిగిన ఓ వ్యక్తి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని విమర్శించారు. హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ పోతుందని తాము సవాల్‌ను స్వీకరించామన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
Similar News
News October 14, 2024
నేడే మద్యం దుకాణాలకు లాటరీ
AP: రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు వచ్చిన 89,882 దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ లాటరీ తీయనుంది. విజేతలుగా నిలిచిన వారికి రేపు వైన్ షాపులను అప్పగించనుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. క్వార్టర్ బాటిల్‌ను రూ.99కే విక్రయించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించింది. అలాగే ఫారిన్ లిక్కర్ ఎమ్మార్పీపై చిల్లర ధర లేకుండా సర్దుబాటు చేయనుంది.
News October 14, 2024
బాబా సిద్దిఖీ హత్య.. అసలెవరీ లారెన్స్ బిష్ణోయ్
సల్మాన్ ఖాన్ ఫ్రెండ్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. 30 ఏళ్ల బిష్ణోయ్ చండీగఢ్‌లో చదువుకునే సమయంలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయమైంది. ఆ తర్వాత అతడితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. 2012 నుంచి ఆయన ఎక్కువ జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అనుచరులను కలుస్తాడు. తమకు ఇష్టమైన కృష్ణ జింకలను చంపాడనే కోపంతో సల్మాన్‌పై పగబట్టాడు.
News October 14, 2024
వెల్లుల్లి తింటే చనిపోయే వ్యాధి గురించి తెలుసా?
చాలామందికి వెల్లుల్లి లేకుండా వంట చేయడం కష్టమే. కానీ వెల్లుల్లి పొరపాటున తిన్నా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఓ వ్యాధి ఉందంటే నమ్ముతారా? దీని పేరు ‘అక్యూట్ ఇంటెర్మిటెంట్ పోర్ఫైరా’. వెల్లుల్లిలో అధికంగా ఉండే సల్ఫర్ పడనివారికి ఈ సమస్య వస్తుంది. రోజుల తరబడి వాంతులు, మలబద్ధకం, తీవ్రమైన తలనొప్పి దీని లక్షణాలు. ఇవి ఉన్నవారు వెల్లుల్లి సహా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.