News July 15, 2024
ఆగస్టు 15 లోగా రుణమాఫీ: మంత్రి ఉత్తమ్

TG: ఆగస్టు 15 లోగా రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఒకే దఫాలో రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గత KCR ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరందించలేకపోయిందని ఆరోపించారు. రుణాల మాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
News July 8, 2025
ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.
News July 8, 2025
ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.