News August 28, 2024

రుణమాఫీ.. ఇవాళ్టి నుంచి గ్రామాల్లో సర్వే

image

TG: రుణమాఫీకి సంబంధించి ఇవాళ్టి నుంచి కుటుంబ సభ్యుల నిర్ధారణకు ప్రతి జిల్లాలో మండల వ్యవసాయ అధికారులు సర్వే చేయనున్నారు. గ్రామాల వారీగా కుటుంబ సభ్యుల వివరాలను నిర్ధారించి, వివరాలు నమోదు చేస్తారు. అనంతరం వారికి రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటివరకు 1.24 లక్షల మంది ఆధార్ వివరాలను బ్యాంకులకు సరిచేయడానికి ఇవ్వగా, 41,339 మంది ఆధార్ వివరాలను సరిచేశారు. ఆగస్టు 15 నాటికి 22.37 లక్షల మందికి రుణమాఫీ జరిగింది.

Similar News

News November 25, 2025

ఉత్తర తెలంగాణకు రూ.10,000కోట్ల NH ప్రాజెక్టులు

image

తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

News November 25, 2025

కుల్దీప్ యాదవ్ @134

image

ఇదేంటి అనుకుంటున్నారా? దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతుల సంఖ్య. 11 మందిలో 100 బంతులకు‌పైగా ఎదుర్కొన్నది ఆయనే కావడం గమనార్హం. 134 బంతులను ఎదుర్కొన్న కుల్దీప్ 19 పరుగులు చేశారు. జైస్వాల్ 58(97), సుందర్ 42(92) చేశారు. కాగా రెండో ఇన్నింగ్సులోనైనా వీలైనంత ఎక్కువ టైమ్ క్రీజులో ఉంటేనే భారత్ ఓటమి నుంచి తప్పించుకోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.

News November 25, 2025

నవంబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం(ఫొటోలో)
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం