News August 28, 2024
రుణమాఫీ.. ఇవాళ్టి నుంచి గ్రామాల్లో సర్వే

TG: రుణమాఫీకి సంబంధించి ఇవాళ్టి నుంచి కుటుంబ సభ్యుల నిర్ధారణకు ప్రతి జిల్లాలో మండల వ్యవసాయ అధికారులు సర్వే చేయనున్నారు. గ్రామాల వారీగా కుటుంబ సభ్యుల వివరాలను నిర్ధారించి, వివరాలు నమోదు చేస్తారు. అనంతరం వారికి రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటివరకు 1.24 లక్షల మంది ఆధార్ వివరాలను బ్యాంకులకు సరిచేయడానికి ఇవ్వగా, 41,339 మంది ఆధార్ వివరాలను సరిచేశారు. ఆగస్టు 15 నాటికి 22.37 లక్షల మందికి రుణమాఫీ జరిగింది.
Similar News
News February 9, 2026
క్లీనింగ్ టిప్స్..

* వంటింటి అరల్లో బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది. * బాత్‌రూం షవర్ రంధ్రాలు మూసుకుపోతే… దానిని వైట్ వెనిగర్‌తో శుభ్రం చేయాలి. * ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే… కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో కలిపి వాటిని తుడిస్తే సమస్య తగ్గుతుంది. * ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
News February 9, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News February 9, 2026
కోడి మాంసం, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్నాయుడు

AP: బర్డ్ ఫ్లూను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నమయ్య(D) సదుం(M)లో వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కోళ్ల పెంపకందారులు బయోసెక్యూరిటీ చర్యలు పాటించాలని ఆదేశించారు. కోడి మాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితమని చెప్పారు. అసాధారణ రీతిలో పక్షులు మరణిస్తే అధికారులకు తెలియజేయాలన్నారు.


