News August 3, 2024
కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి: మంత్రి అచ్చెన్నాయుడు
AP: కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి వారికి రుణాలు ఇవ్వాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ఆప్కాబ్(APCOB)-డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని సూచించారు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని, డిజిటలైజేషన్‌తోనే అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ఆప్కాబ్ సమావేశంలో వ్యాఖ్యానించారు.
Similar News
News September 13, 2024
అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?
AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
News September 13, 2024
ALERT.. మళ్లీ వర్షాలు
AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
News September 13, 2024
ఈ నెల 21న మోదీ-బైడెన్ భేటీ
ఈ నెల 21న క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో కూడా పాల్గొంటారని పేర్కొంది. నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్‌లో జరిగే ఈ సదస్సులో క్వాడ్ ప్రాముఖ్యత, ఆరోగ్య భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రకృతి వైపరీత్యాలపై స్పందన, సముద్ర భద్రత వంటి విషయాలపై చర్చించనున్నారు.