News August 12, 2025

స్థానిక ఎన్నికలు.. త్వరలో కీలక నిర్ణయం!

image

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని CM <<17330155>>రేవంత్<<>> వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో నిన్న CM చర్చించారు. ఈనెల 16/17న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీపరంగా రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నేతలతో చర్చించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో రిజర్వేషన్లు, ఎన్నికలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది.

Similar News

News March 13, 2026

యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.

News March 13, 2026

కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

image

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 13, 2026

BHELలో 47 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) 47అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://jhs.bhel.com