News September 26, 2024
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు: TPCC చీఫ్
TG: రానున్న 4 రోజుల్లో కులగణన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ కులగణనను పట్టించుకోలేదని ఆరోపించారు. క్యాస్ట్ సెన్సస్‌కు బీజేపీ వ్యతిరేకమని మహేశ్ మండిపడ్డారు.
Similar News
News October 5, 2024
భారీగా పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలు
<<14214575>>నిత్యావసరాల<<>> ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరో భారం పడుతోంది. వర్షాలు, వరదలతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో ఏపీ, టీజీలో టమాటా, ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. గతవారం ఉల్లి కిలో రూ.60ఉండగా, ఇప్పుడు రూ.80కి చేరింది. టమాటా ధర గతవారం రూ.50-60 ఉండగా ఇప్పుడు <<14269271>>రూ.80-90<<>> దాటేసింది. దసరా నాటికి రేట్లు రూ.100 దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News October 5, 2024
ఖైదీల అసహజ మరణాలకు రూ.5 లక్షల పరిహారం
AP: జైళ్లలో ఖైదీలు మరణిస్తే ఇచ్చే పరిహారంపై రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఘర్షణ, జైలు సిబ్బంది వేధింపులతో ఖైదీ మరణిస్తే కుటుంబీకులకు రూ.5 లక్షలు అందిస్తారు. జైలు అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతో ఖైదీ చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5 లక్షలు చెల్లిస్తారు. సహజ మరణం, అనారోగ్యం, తప్పించుకుని పారిపోయి చనిపోతే ఈ పరిహారం వర్తించదు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిబంధనలు రూపొందించారు.
News October 5, 2024
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందంటే?
TG: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనుంది. రేషన్ షాప్‌కు వెళ్లి ఈ కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ స్కీములు, RTC బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చు.