News April 8, 2025
బలం లేదని స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారు: జగన్

APలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీకి బలం లేదని 7 చోట్ల చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారని ఆరోపించారు. రామగిరిలో 9 MPTC స్థానాలను వైసీపీ గెలిచిందని, టీడీపీ ఎమ్మెల్యే, తనయుడు, రామగిరి ఎస్ఐ దౌర్జన్యాలు చేసి తమ ఎంపీపీ స్థానం గెలిచేందుకు ప్రయత్నించారని విమర్శించారు. దీన్ని అడ్డుకుంటే తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
Similar News
News April 19, 2025
అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్

కెనడాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. హామిల్టన్‌లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా ఒంటారియోలోని ఓ బస్టాప్ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులు జరిపాడు. కానీ ఓ బుల్లెట్ మిస్సై హర్‌సిమ్రత్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
News April 19, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
News April 19, 2025
JEE మెయిన్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ఎవరంటే?

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వారిలో నలుగురు తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష గుప్తాకు 8, అజయ్ రెడ్డికి 16(ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి ర్యాంక్), బనిబ్రత మజీకి 24వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకుతో పాటు బాలికల్లో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.