News July 17, 2024
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలను తరిమికొట్టిన స్థానికులు!
జమ్మూకశ్మీర్‌లో మరోసారి అలజడి సృష్టిద్దామనుకున్న ఉగ్రమూకలను అక్కడి స్థానికులు తిప్పికొట్టారు. ఇటీవల నలుగురు జవాన్లను ముష్కరులు బలి తీసుకున్న దోడా జిల్లా దెస్సా ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది. మలన్ గ్రామంలో ఈరోజు ఉదయం విలేజ్ డిఫెన్స్ గ్రూప్ పరారీలో ఉన్న ఉగ్రవాదులను గుర్తించి కాల్పులు జరిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో గ్రామస్థులు ఎవరూ గాయపడలేదు.
Similar News
News December 1, 2024
భారత్-బంగ్లాదేశ్‌కు పెద్ద తేడా లేదు: ముఫ్తీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య తేడా లేదని PDP చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. UPలోని సంభల్ మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లు, జరిగిన ప్రాణ నష్టాన్ని బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను పోల్చుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మసీదులు, దర్గాలపై తలెత్తుతున్న వివాదాలు ఆందోళనకరమన్నారు. ఇవి 1947 నాటి దేశ పరిస్థితుల వైపు తీసుకెళ్తున్నాయనే భయం నెలకొందన్నారు.
News December 1, 2024
ఈ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు
AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు డిసెంబర్ 2న సెలవు ప్రకటించారు. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రకటించారు. విద్యాసంస్థలన్నీ సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
News December 1, 2024
‘పీలింగ్స్’పై స్పందించిన రష్మిక.. అల్లు అర్జున్ కామెంట్ ఇదే!
పుష్ప-2 నుంచి ‘పీలింగ్స్’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. డాన్స్ విషయంలో తన కెరీర్లో ఇప్పటి వరకూ ఇదే అత్యంత కష్టమైన సాంగ్ అని రష్మిక ట్వీట్ చేశారు. ‘పీలింగ్స్ సాంగ్ ఫుల్ వైబ్, ఫుల్ మాస్. ఎవరైనా ఎత్తుకుంటే నాకు చాలా భయం. అల్లు అర్జున్ సార్ వల్ల ఆ భయాన్ని దాటాను. చాలా కష్టమైన పాట కానీ ఎంజాయ్ చేశాను’ అని పేర్కొన్నారు. అద్భుతంగా డాన్స్ చేశారంటూ ‘యూ రాక్డ్’ అని అల్లు అర్జున్ ఆమెకు బదులిచ్చారు.