News March 9, 2025
లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.
Similar News
News March 9, 2025
రేపు ఈ మండలాల్లో వడగాలులు

AP: రేపు పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, వైరామవరం
పార్వతీపురం మన్యం(D) గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మిపురం, జియమ్మవలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం, ఏలూరు (D) కుకునూర్, వేలేర్పాడు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయని పేర్కొంది.
News March 9, 2025
ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు CM చంద్రబాబు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏప్రిల్ 11న స్వామి వారి కళ్యాణం సందర్భంగా సీఎం ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. భోజన వసతి, ప్రసాద వితరణ ప్రతి భక్తునికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News March 9, 2025
రేపు అమలక ఏకాదశి.. ఏం చేయాలంటే?

ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి ‘అమలక ఏకాదశి’. అమలక అంటే ఉసిరికాయ అని అర్థం. ఈరోజున విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో నివాసం ఉంటారని నమ్మకం. అందుకే ఉపవాసం ఉండి ఉసిరి చెట్టును పూజిస్తే పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఉసిరి, నల్ల నువ్వులు వంటివి దానం చేస్తే మంచిదని పేర్కొన్నారు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు.