News March 9, 2025
లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.
Similar News
News March 23, 2025
ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రి

TG: రాష్ట్రంలోని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఏప్రిల్, మే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. 600 ప్రొఫెసర్, 2900 అసిస్టెంట్ ప్రొఫెసర్, 332 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో 2,077 ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని, త్వరలో 195 నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.
News March 23, 2025
ధోనీ రిటైర్మెంట్‌పై CSK కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

MS ధోనీ మరి కొన్నేళ్లు ఆడతారా? ఈ ప్రశ్నకు CSK కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర జవాబిచ్చారు. ‘51ఏళ్ల వయసులోనూ సచిన్ మాస్టర్స్ లీగ్‌లో ఎలా ఆడారో చూశాం. కాబట్టి ధోనీలో ఇంకా చాలా ఏళ్ల ఆట మిగిలి ఉందనుకుంటున్నా. 43 ఏళ్ల వయసులోనూ ఆయన జట్టుకోసం పడే కష్టం మా అందరికీ స్ఫూర్తినిస్తుంటుంది. జట్టులో తన పాత్రకు అనుగుణంగా వీలైనన్ని సిక్సులు కొట్టడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News March 23, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

బర్డ్‌ఫ్లూ భయాన్ని వీడి ప్రజలు ఇప్పుడిప్పుడే చికెన్ తినడం మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలో కోడి మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి కేజీ చికెన్ రూ.170 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.160కి కూడా లభిస్తోంది. అయితే ఎండలు ముదరడంతో ఫారాల్లో కోళ్ల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సప్లై తగ్గి చికెన్ ధర పెరిగే ఛాన్స్ ఉంది.