News December 2, 2024
లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్, ఛైర్మన్ సముదాయించినా విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను స్పీకర్, ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.
Similar News
News February 2, 2026
విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4, 6, 6, 6, 4, 6

వరల్డ్ లెజెండ్స్ ప్రొ T20 లీగ్‌లో అభిమన్యు మిథున్(రాజస్థాన్ లయన్స్) విధ్వంసం సృష్టించారు. పవన్ నేగీ(ఢిల్లీ వారియర్స్) వేసిన 20వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదారు. 7 బంతుల్లో 33 రన్స్(471.43 స్ట్రైక్ రేటు) చేశారు. మరో ప్లేయర్ మోర్గాన్ 87 రన్స్(10 సిక్సులు, 1 ఫోర్) బాదడంతో రాజస్థాన్ 185-7 స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో ఢిల్లీ 162 పరుగులకే ఆలౌటైంది.
News February 2, 2026
కాంగ్రెస్ ప్రభుత్వ పెట్టుబడులన్నీ కట్టుకథలే: కవిత

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టు కథలేనని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘సింగపూర్ గేట్‌వే సంస్థకు వెబ్సైటూ లేదు. ₹70వేల CR పెట్టుబడి అన్న ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ కంపెనీ USలో ₹90వేల CR, బ్రెజిల్‌లో ₹70వేల CRకు MOU చేసింది. గతేడాదే ఏర్పాటైన ఇది MOUల కోసమే పుట్టినట్లుంది. జయవీర్ రెడ్డి కంపెనీ నిజమైనదో కాదో చెప్పాలి. ₹10L లేని కంపెనీలు ₹వేలకోట్ల MOUలు చేశాయి’ అని అన్నారు.
News February 2, 2026
Budget: గోల్డ్ బాండ్స్ ఇకపై ట్యాక్స్ ఫ్రీ కాదా?

బడ్జెట్‌లో గోల్డ్ బాండ్ల పన్ను మినహాయింపును కుదించారు. ఇకపై RBI ఈ బాండ్లను ఇష్యూ చేసినప్పుడే నేరుగా కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటేనే పన్ను ఉండదు. ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభంపై కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే మెచ్యూరిటీ కంటే ముందు అమ్మినా పన్ను తప్పదు. అయితే ఏటా వచ్చే 2.5% వడ్డీపై పాత పద్ధతిలోనే పన్ను వర్తిస్తుంది.


