News December 2, 2024
లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్, ఛైర్మన్ సముదాయించినా విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను స్పీకర్, ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.
Similar News
News March 9, 2026
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ మర్డర్..!

కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. భర్త నాగేశ్వరరావుకు వదినతో వివాహేతర సంబంధం కారణంగానే గొడవలు జరిగాయని, ఆయనే తన భార్యను హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్‌లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.


