News February 5, 2025
ఏపీ అసెంబ్లీకి లోక్‌సభ స్పీకర్

AP: అసెంబ్లీలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు MLA, MLCలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఓరియంటేషన్ క్లాసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనుండగా, ఒక సెషన్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడనున్నారు. ఈ క్లాసుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Similar News
News February 16, 2025
కెనడా వీసా నిబంధనలు మరింత కఠినతరం

వీసా నిబంధనల్ని కెనడా మరింత కఠినతరం చేసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. జారీ చేసిన స్టడీ వీసాలు, వర్క్ పర్మిట్, తాత్కాలిక నివాస అనుమతులను కూడా ఇకపై వారు రద్దు చేయొచ్చు. గతంలో దరఖాస్తుల తిరస్కరణ అధికారం మాత్రమే వారికి ఉండేది. కాగా.. అంతర్జాతీయ విద్యార్థులు తమ దేశంలో చేయాల్సిన బ్యాంకు డిపాజిట్‌ను ఇప్పటికే కెనడా రెండింతలు చేసింది.
News February 16, 2025
నేటి నుంచి కులగణన రీసర్వే

TG: గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన కులసర్వేలో పాల్గొనని వారికి నేటి నుంచి రీసర్వే చేయనున్నారు. ఈ సారి 3.56 లక్షల కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు కాల్ చేయడం, ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో వివరాలు అందించడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. ఈ నెల 28 వరకు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు.
News February 16, 2025
మరో వలసదారుల బ్యాచ్‌ను పంపించిన US

116మంది అక్రమ వలసదారులతో కూడిన మరో విమానాన్ని అమెరికా తాజాగా భారత్‌కు పంపించింది. ఈ విమానం నిన్న రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. తిరిగొచ్చినవారిలో పంజాబ్(65మంది), హరియాణా(33), గుజరాత్(8మంది), యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తలో ఇద్దరు, హిమాచల్, కశ్మీర్ నుంచి చెరొకరు ఉన్నారు. తొలి దఫా వలసదారుల విమానం ఈ నెల 5న వచ్చిన సంగతి తెలిసిందే.