News November 30, 2024
‘నిద్రలేని రాత్రులకు విముక్తి ఇచ్చావ్ లోకేశ్ అన్న’: యువకుడు
మంగళగిరిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఉద్యోగం పొందానని సంతోషంతో ట్వీట్ చేసిన ఓ యువకుడికి మంత్రి నారా లోకేశ్ రిప్లై ఇచ్చారు. ‘ధన్యవాదాలు నారా లోకేశ్ అన్న. పోయిన వారం మీరు కండక్ట్ చేసిన జాబ్ మేళాలో జాబ్ వచ్చింది అన్నయ్య. ఈరోజు రిపోర్టింగ్ తేదీ కన్ఫర్మ్ చేశారు. ఎన్నో నిద్రలేని రాత్రులకు విముక్తి ఇచ్చావ్ అన్న. థ్యాంక్స్’ అని ట్వీట్ చేశాడు. అతనికి లోకేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Similar News
News December 9, 2024
కష్టాల్లో ఉన్న స్నేహితులకు రష్యా ద్రోహం చేయదు: రాయబారి
సిరియాలో తిరుగుబాటుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల రష్యన్ ఫెడరేషన్ శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసద్, అతని కుటుంబం మాస్కోకు చేరుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితులకు రష్యా ఎప్పుడూ ద్రోహం చేయదు. ఇదే రష్యా-అమెరికాకు మధ్య ఉన్న వ్యత్యాసం’ అని రాసుకొచ్చారు.
News December 9, 2024
చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురు
TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మన్ పౌరుడేనని కోర్టు తేల్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విచారణ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.30లక్షల జరిమానా విధించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ.5లక్షలు చెల్లించాలని పేర్కొంది.
News December 9, 2024
మంచు మనోజ్ కడుపు, వెన్నెముకకు గాయాలు
మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి భార్యతో కలిసి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇవాళ బయటకు వచ్చింది.