News November 22, 2024

స్కూళ్ల సమయం పెంపుపై లోకేశ్ క్లారిటీ

image

AP: స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు MLAలు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన అన్నారు. పైలట్ ప్రాజెక్టుగానే అమలు చేస్తున్నామని, ఫీడ్ బ్యాక్‌కు తగ్గట్లు సమయం మార్చుతామని తెలిపారు. హైస్కూళ్లు ఉదయం 9- 4గంటల వరకు పని చేస్తుండగా, 5వరకు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని 2స్కూళ్లలో ఇది అమలు అవుతోంది.

Similar News

News December 9, 2024

‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్

image

INDIA కూట‌మి సార‌థ్య బాధ్య‌తలు మ‌మ‌తా బెన‌ర్జీకి ఇవ్వాల‌న్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల తర్వాత మిత్ర‌ప‌క్షాల భేటీనే జ‌ర‌గ‌లేద‌ని, అలాంట‌ప్పుడు నాయ‌క‌త్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌శ్నించారు. స‌మావేశం నిర్వహించినప్పుడు మ‌మ‌త సార‌థ్య బాధ్య‌త‌లు కోర‌వ‌చ్చని, అప్పుడే ఈ విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు.

News December 9, 2024

నాగబాబుకు మంత్రి పదవి

image

AP: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

News December 9, 2024

మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు

image

మంచు ఫ్యామిలీలో గొడవ తారస్థాయికి చేరుతోంది. తనపై దాడి చేశారంటూ కొద్దిసేపటి క్రితమే మనోజ్ పహాడీ షరీఫ్ PSలో ఫిర్యాదు చేశారు. తాజాగా తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీకి ఆయన లేఖ రాశారు. మనోజ్‌తో పాటు కోడలు మౌనిక నుంచి తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందోనని మంచు అభిమానులు చర్చించుకుంటున్నారు.