News January 16, 2025
నితీశ్‌కు లోకేశ్ అభినందనలు

AP: రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన నితీశ్ మంత్రిని తాజాగా కలిసారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేశ్, జ్ఞాపికను అందించారు.
Similar News
News February 9, 2025
16 నుంచి పెద్దగట్టు జాతర

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు ఇది జరగనుంది. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షల మంది వస్తారు. అటు జాతరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
News February 9, 2025
భార్యను నరికిన ఘటనలో మరో సంచలనం!

TG: హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన <<15262482>>ఘటనలో<<>> మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.
News February 9, 2025
లెబనాన్‌లో ఎట్టకేలకు పూర్తిస్థాయి సర్కారు

రెండేళ్ల నుంచి అట్టుడుకుతున్న లెబనాన్‌లో ఎట్టకేలకు శాంతి దిశగా అడుగులు పడ్డాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ స్థానంలో పూర్తిస్థాయి సర్కారు ఏర్పాటుకు దేశాధ్యక్షుడు జోసెఫ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రధాని నవాఫ్ సలామ్, తన 24మంది సభ్యుల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేస్తామని, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు సలామ్ హామీ ఇచ్చారు.