News April 11, 2025
అనారోగ్యంతో అప్పులపాలు.. ఆదుకుంటామని లోకేశ్ హామీ

AP: ఏలూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే చిరుద్యోగి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నరాలు, గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో రూ.7లక్షలకు పైగా ఆస్పత్రి ఖర్చులు అయ్యాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అతడి పరిస్థితి తెలిసి, ప్రసాద్‌ను ఆదుకోవాలని టీడీపీ నేతలు మంత్రి లోకేశ్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని తన టీమ్‌ను మంత్రి ఆదేశించారు.
Similar News
News November 21, 2025
నిజామాబాద్: నిఖత్ జరీన్‌కు మంత్రి శుభాకాంక్షలు

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించిందని మంత్రి అభినందించారు. నిఖత్ జరీన్ భవిష్యత్‌లో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్రాల ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
News November 21, 2025
CRICKET UPDATES

* రేపటి నుంచి యాషెస్ సంగ్రామం.. ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం
* ట్రై సిరీస్‌లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే.. 163 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 95 రన్స్‌కే కుప్పకూలిన లంక
* ఈ నెల 27న WPL వేలం.. తొలి సెట్లో వేలానికి రానున్న దీప్తి శర్మ, రేణుకా సింగ్
* వందో టెస్టులో సెంచరీ బాదిన బంగ్లా స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా రికార్డ్
News November 21, 2025
నకిలీ ORSలను వెంటనే తొలగించండి: FSSAI

ఫుడ్ సేఫ్టీ&స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నకిలీ ORSలపై స్టేట్స్, కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మిస్ లీడింగ్, మోసపూరిత ఎలక్ట్రోలైట్ పానియాలను దుకాణాలు, ఇ-కామర్స్ సైట్ల నుంచి తొలగించాలంది. మార్కెట్లో ORS పేరుతో నకిలీ డ్రింక్స్ చలామణి అవుతున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి WHO గైడ్‌లైన్స్ ప్రకారం ORS స్టాండర్డ్స్‌లో లేనందున అమ్మకానికి ఉంచకుండా చూడాలని కోరింది.


