News July 28, 2024
‘లోకేశ్ స్పందించాలి’.. ఏపీ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
HYDలోని అంబేడ్కర్ ఓపెన్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు 2024-25 ఏడాదికి తెలంగాణ విద్యార్థుల వరకే అడ్మిషన్ల నోటిఫికేషన్లు విడుదల చేశాయి. జూన్ 2తో HYD ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో తెలంగాణ విద్యార్థులు మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ 2 యూనివర్సిటీల విభజన పూర్తవకపోవడంతో ఇప్పుడు ఏపీ విద్యార్థుల అడ్మిషన్లు ప్రశ్నార్థకమయ్యాయి. మంత్రి లోకేశ్ దీనిపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.
Similar News
News October 16, 2024
ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.
News October 16, 2024
సింగిల్ టేక్‌లో 11 నిమిషాల సీన్: వరుణ్ ధవన్
వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.
News October 16, 2024
ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ
TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను క్యాట్ ఆదేశించిన విషయం తెలిసిందే.