News August 25, 2024

విద్యాశాఖను తీసుకోవద్దని లోకేశ్‌కు చెప్పారు.. కానీ: కేంద్రమంత్రి రామ్మోహన్

image

AP: టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ కృషి చేస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. విద్యాశాఖను తీసుకోవద్దని ఆయనకు చాలా మంది సూచించారని, అయితే ఛాలెంజింగ్‌గా ఆయన పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో రెస్పాన్స్ లేదని టీచర్లకు అనిపించవచ్చని, కానీ రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు అన్నివిధాలా గౌరవం ఇస్తారని పేర్కొన్నారు.

Similar News

News September 16, 2024

5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.160 పెరిగి రూ.75,050కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.150 పెరిగి రూ.68,800 పలుకుతోంది. గత 5 రోజుల్లో ధర ఏకంగా రూ.1750 పెరిగింది. ఇక వెండి ధర కేజీ మరో రూ.1,000 పెరిగి రూ.98వేలకు చేరింది. 5 రోజుల్లో వెండి ధర రూ.6,500 పెరగడం గమనార్హం.

News September 16, 2024

వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారీ ఖర్చు పెంచలేదు: రైల్వే శాఖ

image

కాంట్రాక్టర్ల కోసం వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారీ ఖర్చును కేంద్రం 50% పెంచిందని TMC MP సాకేత్ ట్వీట్ చేశారు. ‘ఉన్నట్టుండి రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కి తగ్గించారు. ఒక్కో ట్రైన్ కాస్ట్‌ను ₹290cr నుంచి ₹436crకు పెంచారు’ అని ఆరోపించారు. దీనిపై రైల్వే శాఖ స్పందిస్తూ ‘రైళ్లను తగ్గించి ఒక్కో రైలుకు కోచ్‌లను 16 నుంచి 24కు పెంచాం. దీని వల్ల కాంట్రాక్టు వాల్యూ తగ్గింది కానీ పెరగలేదు’ అని తెలిపింది.

News September 16, 2024

పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి(PHOTOS)

image

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.