News March 11, 2025
CM స్టాలిన్‌కు లోకేశ్ పరోక్ష కౌంటర్

AP: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు మంత్రి నారా లోకేశ్ పరోక్షంగా కౌంటర్ వేశారు. ‘పక్క రాష్ట్రాల వారు త్రిభాషా విధానంపై కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. భాష చుట్టూ రాజకీయం చేయడం తగదు. మాతృభాష అందరికీ కీలకమే. మాతృభాషను కాపాడుకోవాలని కేంద్రం కూడా స్పష్టంగా చెబుతోంది. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేయకూడదు. దీని వల్ల ప్రాంతీయ భాషలకు ఎలాంటి ప్రమాదం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News March 25, 2025
ఒక్క రోజులో.. 3,03,100 ఫాలోవర్స్!

మొన్నటి వరకూ ముంబై బౌలర్ విఘ్నేశ్ పుతుర్ గురించి చాలా మందికి తెలియదు. కానీ, ఒక్క మ్యాచుతో ఆయన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆయనకు రెండు రోజుల క్రితం 24.9వేల మంది ఫాలోవర్లుంటే, నేడు వారి సంఖ్య 3,28,000కి చేరింది. ఆటో డ్రైవర్ కొడుకు గ్రౌండ్‌లో ఆటగాళ్లను షేక్ చేశారని కొనియాడుతున్నారు. జట్టులో ఉన్న సచిన్ కుమారుడు అర్జున్ విఘ్నేశ్‌ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News March 25, 2025
ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వలేదు.. లంచాలెలా?: వైసీపీ

APలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించిన TDP MP శ్రీకృష్ణదేవరాయలుపై వైసీపీ ఫైరయ్యింది. ‘GOVT ద్వారా మద్యాన్ని తక్కువగా అమ్మడమే కాకుండా విక్రయవేళల్ని కుదించిన YCP హయాంలో లంచాలు ఇస్తారా? లేక ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగిన చంద్రబాబు పాలనలో లంచాలు ఇస్తారా? మెజార్టీ డిస్టిలరీలకు అనుమతులిచ్చిన CBNకు లంచాలు వస్తాయా? ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వని వైసీపీ హయాంలో లంచాలు వస్తాయా?’ అని నిలదీసింది.
News March 25, 2025
రేపు OTTలోకి వచ్చేస్తున్న ‘ముఫాసా’

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ మూవీ గతేడాది విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.