News April 18, 2024

ఈ రోజు లోకేశ్ ముసుగు తొలగిపోతుంది: వైసీపీ

image

AP: ఎన్నికల వేళ విమర్శలు, ఆరోపణలతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గురించి సంచలన విషయాన్ని బయట పెట్టబోతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘పప్పు పులకేశ్ అబద్ధాల గురించి చెప్పబోతున్నాం. ఇవాళ అతని మాస్క్ తొలగిపోతుంది. లోకేశ్ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు’ అని రాసుకొచ్చింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News September 10, 2024

ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే వేదికపైకి తారక్, అల్లు అర్జున్?

image

ఈరోజు జరిగే ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారనే చర్చ నడుస్తోంది. తారక్, బన్ని ‘బావ’ అని ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ ఈవెంట్‌కు బన్ని రానున్నారని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పాటలు హిట్ అయిన తరుణంలో ట్రైలర్‌పైనా భారీ అంచనాలున్నాయి.

News September 10, 2024

బిల్లులు క్లియర్ చేయండి: యూనస్‌కు అదానీ లేఖ

image

బంగ్లా పవర్ బోర్డు నుంచి రావాల్సిన $800 మిలియన్ల బకాయిలను త్వరగా ఇప్పించాలని ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌ను అదానీ పవర్ కోరింది. ఈ అంశంలో జోక్యం చేసుకొని బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని లేఖ రాసింది. ఝార్ఖండ్ ప్లాంట్ నుంచి అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. నెలకు $90-95 మిలియన్లు తీసుకుంటుంది. కొన్ని నెలలుగా అందులో సగం వరకే చెల్లిస్తుండటంతో బకాయిలు పేరుకుపోయాయి.

News September 10, 2024

ప్రమాదాలను నివారించిన రైల్వే సిబ్బందికి సన్మానం

image

TG: భారీ వర్షాల సమయంలో రైల్వే ట్రాక్‌లు ధ్వంసమైన ప్రదేశాలను గుర్తించి పైఅధికారులకు చెప్పి, ప్రమాదాలను నివారించిన వారిని రైల్వేశాఖ సన్మానించింది. సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆరుగురు సిబ్బందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. G.మోహన్(ఇంటికన్నె), B.జగదీశ్(తాళ్లపూసపల్లి), K.కృష్ణ, B.జైల్‌సింగ్, V.సైదానాయక్, P.రాజమౌళి(మహబూబాబాద్) ఉన్నారు.