News August 8, 2024
వాడీవేడిగా లోక్‌సభ.. రాహుల్ వాకౌట్
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై గురువారం లోక్ సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. అవినీతిపరులైన బీజేపీ నేతల కోసమే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని, లేదా స్టాండింగ్ కమిటీకి పంపాలని ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ సభ నుంచి వాకౌట్ చేశారు.
Similar News
News September 19, 2024
చరణ్- బుచ్చిబాబు.. మరో ‘రంగస్థలం’ కానుందా?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ కథను బుచ్చిబాబు నాలుగేళ్ల పాటు రాశారు. త్వరలో మూవీ స్టార్ట్ చేయనుండటంతో మూవీ కాస్ట్‌ను డైరెక్టర్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా టీమ్‌లోకి ‘తంగలాన్’ డ్రెస్ డిజైనర్ ఏకాంబరంను తీసుకున్నారు. ఈయనను తీసుకున్నారంటే ‘రంగస్థలం’లాంటి నేటివ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News September 19, 2024
ఈ నెల 21న సీఎంగా ఆతిశీ ప్రమాణం
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆతిశీతో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రకటించారు.
News September 19, 2024
కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు
TG: కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడింది. APలోని ప.గో.లో ఆయనపై కేసు నమోదవ్వగా తెలంగాణ దేవాదాయశాఖ చర్యలకు దిగింది. సీతారామకు కొడుకులు లేకపోవడంతో వెంకట సీతారాంను దత్తత తీసుకుని తాడేపల్లి గూడెంకు చెందిన యువతితో పెళ్లి చేశారు. ఈ క్రమంలో తన పోలికలతో వారసుడు కావాలని కోడలిని వేధించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.