News July 30, 2024

విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా లోకుర్

image

TG: విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకుర్‌ను ప్రభుత్వం నియమించింది. గత ఛైర్మన్ జస్టిస్ <<13639787>>నర్సింహారెడ్డి<<>> ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని BRS అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా లోకుర్‌ను నియమించింది. గతంలో ఏపీ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.

Similar News

News December 10, 2024

వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారని తెలిపారు. జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలవుతాయన్నారు. దానికి సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్లింగ్ పనులు కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 10, 2024

నాగబాబుకు మంత్రి పదవి ఎలా ఖరారైందంటే?

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం 24మంది మంత్రులున్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, TDP పొత్తులో భాగంగా జనసేనకు 4, BJPకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి పవన్, మనోహర్, దుర్గేశ్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు దక్కాల్సిన మరో స్థానాన్ని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.

News December 10, 2024

BREAKING: మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత

image

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ(92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎం, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.