News July 12, 2024

మనుస్మృతిని తీసుకురావాలని చూస్తున్నారు: ఖర్గే

image

జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదివస్‌’గా <<13615795>>ప్రకటించడంపై<<>> AICC అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. ‘రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతిని తీసుకురావాలని BJP-RSS ప్రయత్నిస్తున్నాయి. తద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవారి హక్కులపై దాడి చేయాలని చూస్తున్నాయి. అందుకే రాజ్యాంగమనే పవిత్రమైన పదానికి హత్య అనే పదాన్ని జతచేసి అంబేడ్కర్‌ను అవమానిస్తున్నాయి’ అని ఖర్గే ధ్వజమెత్తారు.

Similar News

News December 6, 2025

మూడో విడతలో 27,277 నామినేషన్లు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.

News December 6, 2025

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<>HAL<<>>), బెంగళూరు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు www.mhrdnats.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 8 నుంచి 13 వరకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in/

News December 6, 2025

రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

image

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.