News July 12, 2024
మనుస్మృతిని తీసుకురావాలని చూస్తున్నారు: ఖర్గే

జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదివస్’గా <<13615795>>ప్రకటించడంపై<<>> AICC అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. ‘రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతిని తీసుకురావాలని BJP-RSS ప్రయత్నిస్తున్నాయి. తద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవారి హక్కులపై దాడి చేయాలని చూస్తున్నాయి. అందుకే రాజ్యాంగమనే పవిత్రమైన పదానికి హత్య అనే పదాన్ని జతచేసి అంబేడ్కర్‌ను అవమానిస్తున్నాయి’ అని ఖర్గే ధ్వజమెత్తారు.
Similar News
News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.
News February 14, 2025
స్టొయినిస్‌పై ఆరోన్ ఫించ్ మండిపాటు

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ ODIల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై మాజీ క్రికెటర్ ఫించ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా అతడి ఇష్టం. ఎవరూ తప్పుబట్టరు. కానీ తనపై నమ్మకంతో సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. మరి అతడు బాధ్యతగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముందుగానే చెప్పాలి కదా? అది కచ్చితంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమైతే కాదు’ అని వ్యాఖ్యానించారు.
News February 14, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.