News October 5, 2024
హర్షసాయిపై లుక్అవుట్ నోటీసులు

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 15, 2026
మ్యాజిక్ జరిగింది: ‘ఉస్తాద్’ ట్రైలర్‌పై మెగాస్టార్

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ <<19383616>>ట్రైలర్<<>>పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అన్నీ శుభాలే’’ అని Xలో పోస్ట్ చేశారు. పవన్, డైరెక్టర్ హరీశ్ శంకర్ సహా సినిమా యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. DSP సంగీతం అందించారు. ఈనెల 19న సినిమా రిలీజ్ కానుంది.
News March 15, 2026
ChatGPTని దాటేసిన ఇండియన్ ఆయిల్

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది ఇండియన్ ఆయిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ChatGPTని దాటేసి ఇండియన్ ఆయిల్ యాప్ నంబర్-1గా నిలిచింది. ఆ యాప్‌లో ఎల్పీజీ కనెక్షన్స్, సిలిండర్ బుకింగ్, ట్రాకింగ్, డిస్ట్రిబ్యూటర్ మార్పు, మెకానిక్ సర్వీసులు లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.
News March 15, 2026
ఇదే ఊపు కొనసాగుతుంది: రోహిత్ శర్మ

భారత క్రికెట్ గత రెండేళ్లుగా సాధిస్తున్న విజయాలపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో మహిళల జట్టు WC నెగ్గడం, ఇటీవల మెన్స్ T20 WCను కైవసం చేసుకోవడం అద్భుతమని కొనియాడారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటం ఉండదు’ అని ధీమా వ్యక్తం చేశారు. పురుషుల, మహిళల జట్లు రెండూ ప్రస్తుతం ఫుల్ ‘మొమెంటం’లో ఉన్నాయని, ఇదే ఊపు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


