News March 17, 2025
ఇన్‌స్టాలో ప్రేమ.. మూడు నిండు ప్రాణాలు బలి

ఇన్‌స్టాలో మొదలైన 2 వేర్వేరు ప్రేమకథలు విషాదాంతంగా ముగిశాయి. TGలో హుజూరాబాద్‌కు చెందిన రాహుల్(18), నిర్మల్ జిల్లాకు చెందిన శ్వేత(20) ఇన్‌స్టాలో ప్రేమించుకున్నారు. పెద్దవారికి భయపడి ఇద్దరూ రైలు కింద పడి చనిపోయారు. ఇక గుంటూరుకు చెందిన సాయికుమార్, గీతిక అనే జంట ఇన్‌స్టాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నెలల వ్యవధిలోనే గీతిక అనుమానాస్పదంగా మరణించింది. భర్తే చంపాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
Similar News
News April 18, 2025
మూడు రోజుల్లో రూ.2400 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు స్వల్పంగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.89,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.97,580 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ.2400 పెరగడం గమనార్హం.
News April 18, 2025
IPL: RCB vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు?

IPLలో నేడు బెంగళూరు వేదికగా RCB, PBKS తలపడనున్నాయి. అయితే, ఆ నగరంలో ఇవాళ ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలుగుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వరుణుడు అడ్డుపడకుంటే మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సుంది. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా.. PBKS(17), RCB(16) మ్యాచుల్లో విజయం సాధించాయి.
News April 18, 2025
నారాయణ మూర్తి మనవడికి రూ.3.3కోట్ల డివిడెండ్

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.3.3 కోట్ల డివిడెండ్ అందుకున్నారు. 2023లో రోహన్ జన్మించినప్పుడు బహుమతిగా రూ.240కోట్లు విలువ గల 15లక్షల షేర్లను నారాయణ మూర్తి ఇచ్చారు. దీంతో యంగ్ మిలియనీర్‌గా ఏకగ్రహ్ అవతరించారు. కాగా ఈ షేర్లకు గతేడాది రూ.7.35కోట్ల డివిడెండ్ అందుకున్నారు. ఇప్పటి వరకూ ఈ షేర్లపై మెుత్తంగా రూ.10.65కోట్ల డివిడెండ్ అందుకున్నారు.