News April 7, 2025

అల్పపీడనం.. 3 రోజులు విస్తారంగా వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది రేపటి వరకు వాయవ్య దిశగా కదిలి ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. ఉత్తరాంధ్ర, ఉ.గో, కృష్ణా జిల్లాలపై ప్రభావం ఉండొచ్చంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరిగి నాలుగు రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News April 7, 2025

IPL.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

IPLలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. T20ల్లో 13,000 రన్స్ పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచారు. బౌల్ట్ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో ఈ ఘనతను అందుకున్నారు. 386 ఇన్నింగ్సుల్లో విరాట్ ఈ రికార్డును సాధించగా, అతని కంటే ముందు పొలార్డ్(13,537), షోయబ్ మాలిక్(13557), హేల్స్(13,610) ఉన్నారు. టాప్‌లో గేల్(381 ఇన్నింగ్సుల్లో 14,562 రన్స్) ఉన్నారు.

News April 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

News April 7, 2025

BREAKING: వల్లభనేని వంశీకి బెయిల్

image

AP: భూకబ్జా కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ వంశీ విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

error: Content is protected !!