News August 27, 2024
బంగాళాఖాతంలో అల్పపీడనం.. 3 రోజుల పాటు భారీ వర్షాలు

ఈ నెల 29న ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ పార్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు TGలోనూ ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29న ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.
Similar News
News March 14, 2025
కృష్ణా: ఈనెల 17 నుంచి 10th exams

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.
News March 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 14, 2025
శుభ ముహూర్తం (14-03-2025)

☛ తిథి: పూర్ణిమ ఉ.11.25 వరకు ☛ నక్షత్రం: ఉత్తర పూర్తిగా
☛ శుభ సమయం: 1.ఉ.10.30-12.00 వరకు
2.సా.4.43-4.55 వరకు
☛ రాహుకాలం: మ.10.30-12.00 వరకు
☛ యమగండం: మ.3.00-4.30 వరకు
☛1.దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.మ.12.24-1.12 వరకు
☛ వర్జ్యం: మ.1.26-3.10 వరకు
☛ అమృత ఘడియలు: రా.3.29-5.13 వరకు