News May 23, 2024
అల్పపీడనం.. ఇవాళ, రేపు వర్షాలు
TG: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈనెల 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. అనంతరం అది తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని, ఈనెల 26 నాటికి తుఫాన్ బెంగాల్ తీరానికి చేరుకోవచ్చని పేర్కొంది.
Similar News
News October 12, 2024
శ్రీవారి హుండీ ఆదాయం రూ.26 కోట్లు: ఈవో
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. ‘వాహన సేవలను 15 లక్షల మంది తిలకించారు. గరుడ వాహనం రోజునే 3.3 లక్షల మంది వచ్చారు. 26 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 30 లక్షల లడ్డూలు పంపిణీ చేశాం. లడ్డూ నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో హుండీ ఆదాయం రూ.26 కోట్లు లభించింది’ అని తెలిపారు. ఇవాళ ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
News October 12, 2024
జమ్మి ఆకులే ‘బంగారం’!
తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆకులను ఆత్మీయులకు పంచుతారు. కొందరు పూజగదిలో భద్రపరుస్తారు. కుబేరుడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలో బంగారాన్ని కురిపించాడని, అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారని పురాణాలు చెబుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి. దీని గాలి పీల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
News October 12, 2024
‘రంజీ ట్రోఫీ’కి ఆ పేరు ఎలా వచ్చింది?
నవానగర్ (ప్రస్తుత జామ్‌నగర్) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గతంలో దీన్ని జడేజా రాజ్‌పుత్ రాజవంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్‌గా పిలుస్తారు. నవానగర్‌ను 1907 నుంచి రంజిత్‌సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయన ప్రపంచ ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయన పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జరుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.