News August 22, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.330 తగ్గి రూ.72,870కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.300 తగ్గి రూ.66,800 పలుకుతోంది. వెండి ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,000గా ఉంది.

Similar News

News September 17, 2024

ప్రభుత్వానికి 100 రోజులు.. రేపు NDA శాసనసభా పక్ష భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ భేటీకి dy.cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.

News September 17, 2024

నేడే కేజ్రీవాల్ రాజీనామా.. కొత్త సీఎంపై సర్వత్రా ఉత్కంఠ

image

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌లిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో స‌మావేశ‌మై చర్చించింది. అతిశీ, రాఘ‌వ్ చ‌ద్దా, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, కైలాశ్ గ‌హ్లోత్ CM రేసులో ముందున్నారు.

News September 17, 2024

MBBS యాజమాన్య కోటా ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2024-25కు గాను యాజమాన్య కోటా(B, C) ఎంబీబీఎస్ సీట్ల ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. 25 కాలేజీల్లో 1,914 సీట్లుండగా, B కేటగిరీలో 1,318, C(ఎన్నారై) కేటగిరిలో 596 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: <>http://drntr.uhsap.in<<>>