News October 9, 2024
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.
Similar News
News January 16, 2026
ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. వివిధ పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు తమకు కోపం, భయం, బాధ వస్తే వాటిని లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని, అలా కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.
News January 16, 2026
కనుమ రోజున ఆవులను ఎందుకు పూజించాలి?

మన ధర్మశాస్త్రాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. అందుకే గోపూజ చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. ఆవు పృష్ఠ భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందని నమ్మకం. అందుకే కనుమ నాడు గోవును పూజిస్తే దారిద్య్రం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని విశ్వాసం.
News January 16, 2026
ఫరీదాబాద్‌లోని ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్‌లోని <


