News October 9, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.

Similar News

News November 13, 2024

ప్రభుత్వాలు ‘బుల్డోజర్ యాక్షన్’ ఎలా తీసుకోవచ్చంటే..

image

అక్రమ కట్టడాలపై <<14598300>>బుల్డోజర్<<>> యాక్షన్‌‌కు దిగేముందే పాటించాల్సిన గైడ్‌లైన్స్‌ను SC వివరించింది. ఆ ప్రాపర్టీ ఓనర్‌కు 15days ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలంది. ఒకటి రిజిస్టర్ పోస్టులో పంపాలని, మరోటి ప్రాపర్టీపై నేరుగా అతికించాలని సూచించింది. ఉల్లంఘించిన రూల్స్, కూల్చివేతకు కారణాలు వివరించాలని, కూల్చివేతను వీడియో తీయించాలని ఆదేశించింది. ఇందులో ఏది పాటించకున్నా కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామంది.

News November 13, 2024

రియల్ ఎస్టేట్ కోసం భూములు లాక్కుంటున్నారు: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూసేకరణ పేరిట పేదల భూములను లాక్కుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు

News November 13, 2024

దాడులు చేయడం మంచిదేనా KTR?: కోమటిరెడ్డి

image

TG: కలెక్టర్, అధికారులపై దాడులు చేయడం మంచిదేనా KTR అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని BRS నేతలు చెప్పడం దారుణమన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్‌తో మాజీ MLA ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. దాడి వెనక ఎవరున్నా వదలబోమని హెచ్చరించారు. ఎఫ్-1రేసులో RBI అనుమతి లేకుండా డబ్బులు చెల్లించారని, ఈ కేసులో KTR తప్పించుకోలేరని తెలిపారు.