News May 12, 2024
విధేయతే కోహ్లీ రాయల్టీ: RCB

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇవాళ ఐపీఎల్‌లో 250వ మ్యాచ్ ఆడనున్నారు. ఒకే ఫ్రాంచైజీ(RCB)కి ఇన్ని మ్యాచ్‌లు ఆడటం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో మేనేజ్‌మెంట్ ఒక స్పెషల్ పోస్టర్‌ను Xలో పోస్టు చేసింది. కోహ్లీకి విధేయతే రాయల్టీ అని రాసుకొచ్చింది. విరాట్ RCB తరఫున 7,897 పరుగులు(131.6 స్ట్రైక్ రేటు, 38.7 యావరేజ్) చేశారు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 264 సిక్సులు, 698 ఫోర్లు బాదారు.
Similar News
News December 16, 2025
నిద్రలేమితో ఆయుష్షు తగ్గే ప్రమాదం

తగినంత నిద్ర లేకపోతే ఆయుష్షు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. USకు చెందిన ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ (OHSU) చేసిన ఈ పరిశోధన ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. స్మోకింగ్ తర్వాత జీవితకాలాన్ని ఎక్కువగా తగ్గించే అంశం ఇదేనని, తక్కువగా నిద్రపోవడం వలన రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించారు.
News December 16, 2025
ఎట్టకేలకు అమ్ముడైన పృథ్వీ షా

యంగ్ బ్యాటర్ పృథ్వీషాకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలం తొలి రౌండ్‌లో షా అమ్ముడుపోలేదు. మరో రౌండ్‌లో బేస్ ప్రైస్ రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఇతడు ఢిల్లీ తరఫునే ఆడారు. 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ, ఆడమ్ మిల్నేను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
News December 16, 2025
రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.


