News August 3, 2024

3 నెలల్లో LRS ప్రక్రియ పూర్తి చేయాలి: మంత్రి

image

TG: మూడు నెలల్లో LRS(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2020 AUG 31-OCT 31 మధ్య LRS దరఖాస్తులు స్వీకరించిందన్నారు. నాలుగేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 25.70లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 18, 2025

GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

image

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.