News August 3, 2024
3 నెలల్లో LRS ప్రక్రియ పూర్తి చేయాలి: మంత్రి
TG: మూడు నెలల్లో LRS(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2020 AUG 31-OCT 31 మధ్య LRS దరఖాస్తులు స్వీకరించిందన్నారు. నాలుగేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 25.70లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 12, 2024
దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపిన రాహుల్: బండి సంజయ్
TG: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్ర సంస్థలను సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో ఆయన చేతులు కలిపారని దుయ్యబట్టారు. ఆయన భారత్‌ను విడిచి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ఒక దేశ ద్రోహ పార్టీ అని మండిపడ్డారు. దేశంలో సిక్కుల మనుగడకు ప్రమాదం ఉందని రాహుల్ వ్యాఖ్యానించగా, ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సమర్థించిన విషయం తెలిసిందే.
News September 12, 2024
మెటా ఏఐకి పబ్లిక్ ఫిగర్ల వాయిస్!
వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌కు త్వరలో <<13848701>>వాయిస్ వెర్షన్<<>> రానుంది. దీనిని డిఫరెంట్ వాయిస్‌లలో అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. మొదటగా ఇంగ్లిష్‌లో పలువురు ప్రజాదరణ పొందిన వ్యక్తుల గొంతులతో తీసుకురానున్నారని, భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారని తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని వాడుకోవచ్చని వివరించింది.
News September 12, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
AP: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.