News May 24, 2024

LS ఎలక్షన్స్: రేపు 58 స్థానాల్లో పోలింగ్

image

లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, రెండు UTల్లోని 58 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. యూపీలో 14, హరియాణా 10, బిహార్ 8, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీ 7, ఒడిశా 6, ఝార్ఖండ్ 4, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇప్పటివరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు/UTల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. రేపటితో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది.

Similar News

News September 15, 2025

GSTని తగ్గించిన కేంద్రం.. ప్రీమియం పెంచేస్తున్న కంపెనీలు!

image

కేంద్రప్రభుత్వం బీమా ప్రీమియంపై జీఎస్టీని 18% నుంచి సున్నాకు తగ్గించినా ప్రజలకు ఆ మేర లబ్ధి చేకూరట్లేదు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 3 నుంచి 5 శాతం వరకు ప్రీమియాన్ని పెంచేశాయి. సెప్టెంబర్ 16 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తన కంపెనీ ప్రకటించినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలు అందట్లేదు. అంతిమంగా 13% వరకే ఆదా కానున్నాయి.

News September 15, 2025

వెంటనే రూ.10వేల కోట్లు విడుదల చేయండి: సబిత

image

TG: విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయండి. మేము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదు’ అని ట్వీట్ చేశారు.

News September 15, 2025

షాపుల్లో GST తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మల

image

GST తగ్గింపుతో 140కోట్ల మందికి ఉపశమనం లభించనుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఈనెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుంది. GST తగ్గింపు వివరాలతో అన్ని దుకాణాల్లో బోర్డులు పెట్టాలి. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాం. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అది సరిగ్గా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి’ అని సూచించారు.