News May 24, 2024
LS ఎలక్షన్స్: రేపు 58 స్థానాల్లో పోలింగ్

లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, రెండు UTల్లోని 58 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. యూపీలో 14, హరియాణా 10, బిహార్ 8, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీ 7, ఒడిశా 6, ఝార్ఖండ్ 4, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇప్పటివరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు/UTల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. రేపటితో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది.
Similar News
News February 17, 2025
ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ: సీఎం

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. కొత్త కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు.
News February 17, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసేది ఎవరంటే?: క్లార్క్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్లార్క్ జోస్యం చెప్పారు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆయన తిరిగి ఫామ్‌లోకి వచ్చారని చెప్పారు. మరోవైపు ENG ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో జోఫ్రాను ఎదుర్కోవడం కష్టమేనని తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తుందన్నారు.
News February 17, 2025
ఫుడ్ డెలివరీ సంస్థలకు ‘చికెన్’ దెబ్బ!

తెలుగు రాష్ట్రాల ప్రజలను ‘బర్డ్ ఫ్లూ’ భయం వెంటాడుతోంది. కొంతకాలం చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలామంది దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం చికెన్ దుకాణాలపైనే కాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలపైనా పడింది. జొమాటో, స్విగ్గీ తదితర యాప్స్‌లో చికెన్ ఐటమ్స్ ఆర్డర్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బదులుగా ఫిష్, మటన్ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. అటు చికెన్ ఆర్డర్లు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ వెలవెలబోతున్నాయి.