News April 19, 2024

LS PHASE-1: కోటీశ్వరులదే హవా

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేడు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. తమిళనాడు నుంచి అత్యధికంగా 202 మంది సంపన్న అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు క్రిమినల్ కేసులు ఉన్న 251 మంది అభ్యర్థుల్లో 28 మంది బీజేపీ, 19 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. DMK, AIADMK నుంచి చెరో 13 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. <<-se>>#Elections2024<<>>

Similar News

News September 16, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 16, సోమవారం
త్రయోదశి: మధ్యాహ్నం 3.10 గంటలకు
ధనిష్ఠ: సాయంత్రం 4.32 గంటలకు
వర్జ్యం: రాత్రి 10.56 నుంచి 12.22 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.26 నుంచి 1.15 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 2.52 నుంచి 3.41 గంటల వరకు

News September 16, 2024

TODAY HEADLINES

image

➣TG: వడ్డీ చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
➣టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
➣మా జోలికి వస్తే ఒళ్లు చింతపండు అయితది: రేవంత్
➣100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా?: హరీశ్
➣AP: మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు: జగన్
➣రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం
➣రాజధాని రైతులకు కోరుకున్న చోట స్థలాలు: మంత్రి నారాయణ
➣విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం కుట్ర: బొత్స

News September 16, 2024

చేతికి ఫ్రాక్చర్‌తో మ్యాచ్‌లో పాల్గొన్న నీరజ్

image

బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జావెలిన్ త్రో స్టార్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను తాను విరిగిన చేతితో ఆడాడని X ద్వారా వెల్లడించారు. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డానని, ఎక్స్ రేలో తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తెలిపారు. డాక్టర్ల సహకారంతో ఫైనల్ ఆడగలిగాని తెలిపారు. ఆట పట్ల అతడికున్న నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.