News November 25, 2024
తొలిరోజు వేలం తర్వాత LSG, RR, PBKS జట్లు
LSG: పంత్, పూరన్, మయాంక్ యాదవ్, బిష్ణోయ్, ఆవేశ్, మిల్లర్, సమద్, బదోనీ, మొహ్సీన్, మార్ష్, మార్క్‌రమ్, జుయల్
RR: జైస్వాల్, శాంసన్, జురెల్, పరాగ్, ఆర్చర్, హెట్మెయిర్, హసరంగ, తీక్షణ, సందీప్ శర్మ, మధ్వాల్, కుమార్ కార్తికేయ
PBKS: శ్రేయస్ అయ్యర్, అర్షదీప్, చాహల్, స్టొయినిస్, శశాంక్, వధేరా, మ్యాక్స్‌వెల్, ప్రభ్‌సిమ్రన్, వైశాఖ్, యశ్ థాకూర్, బ్రార్, విష్ణు వినోద్
Similar News
News December 4, 2024
రేపు ఈ ప్రాంతాల్లో వర్షాలు
AP: రేపు అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
News December 4, 2024
ఇక్కడ అబ్బాయిలు గిన్నెలు తోమి, వంటలు చేయాలి
అమ్మాయిలు ఇంటి పని చేయాలని, అబ్బాయిలు బయట ఆడుకోవచ్చనే కోణాన్ని పిల్లల నుంచి తొలగించేందుకు చెన్నై కార్పొరేషన్ ముందుకొచ్చింది. వారికి లింగ సమానత్వాన్ని నేర్పించేందుకు జెండర్ ఈక్వాలిటీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంట్లో పనులు, గిన్నెలు తోమడం, వంట చేయడం వంటివి నేర్పుతారు. అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో చెప్తారు. చిన్నప్పుడే పిల్లల ఆలోచనా విధానం మార్చితే మార్పులొస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నారు.
News December 4, 2024
అక్కడ ‘పుష్ప-2’ మిడ్ నైట్ షోలు రద్దు
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాకు కర్ణాటకలో షాక్ తగిలింది. బెంగళూరులో ‘పుష్ప-2’ మూవీ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే షోలు వేసేందుకు పలు చోట్ల మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. తాజా ఆదేశాలతో అభిమానులకు నిరాశే ఎదురైంది.