News March 25, 2024

ఆర్సీబీని రెచ్చగొట్టేలా LSG ట్వీట్

image

LSG.. RCBని రెచ్చగొడుతూ పోస్ట్ పెట్టింది. పాయింట్స్ టేబుల్‌లో ఆర్సీబీ 9, LSG 10వ స్థానంలో ఉండటంపై ‘ఈ రాత్రి మా బెస్ట్ ఫ్రెండ్స్‌తో హాయిగా గడిపాను’ అని ట్వీట్ చేసింది. దీనికి పాయింట్స్ టేబుల్ క్లిప్పింగ్‌ను జత చేసింది. దీనిపై RCB ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రెచ్చగొట్టడం మానుకోవాలంటూ హితవుపలుకుతున్నారు. గతేడాది కోహ్లీ-గంభీర్ గొడవతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంటోంది.

Similar News

News November 12, 2024

TODAY HEADLINES

image

☞ రూ.2.94లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
☞ టాటా గ్రూప్ ఛైర్మన్‌తో CM CBN భేటీ.. పెట్టుబడులకు ఓకే
☞ ప్రశ్నిస్తామన్న భయంతోనే YCPకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు: జగన్
☞ రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: TG CM రేవంత్
☞ ఢిల్లీకి KTR.. అమృత్ పథకంలో అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు
☞ TGలో 13 మంది IASల బదిలీ
☞ మ‌ణిపుర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 11 మంది మిలిటెంట్లు హతం

News November 12, 2024

అలాంటి కాల్స్‌కు స్పందించొద్దు: TG పోలీసులు

image

‘మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడింది’ అంటూ వచ్చే మెసేజ్‌లు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దని ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి స్పామ్ మెసేజ్‌లను క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని, సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

News November 12, 2024

రాహుల్ వ్యాఖ్య‌ల‌ను సెన్సార్ చేయండి: బీజేపీ

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో అబద్ధాలు ప్ర‌చారం చేయకుండా రాహుల్ వ్యాఖ్య‌ల‌ను సెన్సార్ చేయాలని ECని BJP కోరింది. ప్ర‌చార సభల్లో రాహుల్ మాట్లాడుతూ MH అవ‌కాశాల‌ను ఇత‌ర రాష్ట్రాలు దోచుకుంటున్నాయంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, రాజ్యాంగాన్ని బీజేపీ తుంగ‌లో తొక్కుతోందంటూ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఫిర్యాదు చేసింది. అత్యధిక FDIలు MHకే దక్కాయని BJP నేతలు గుర్తు చేస్తున్నారు.