News August 14, 2024
మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై L&T ప్రకటన
TG: మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై L&T కీలక ప్రకటన చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఈ నెల 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఇవాళ పైలట్ రన్‌గా నిర్వహించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లోనూ అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. మరోవైపు పెయిడ్ పార్కింగ్‌పై ప్రయాణికుల నుంచి <<13849865>>వ్యతిరేకత<<>> వ్యక్తమైన సంగతి తెలిసిందే.
Similar News
News September 14, 2024
కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 20న విధివిధానాలు?
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
News September 14, 2024
VIRAL: పోలీస్ నిర్బంధంలో గణనాథుడు
పోలీస్ వ్యాన్‌లో వినాయక విగ్రహం ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటో మనసును కలిచివేస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. కర్ణాటకలోని మాండ్యలో హిందువులపై దాడిని నిరసిస్తూ బెంగళూరులో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే 40మంది ఆందోళనకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక విగ్రహాన్ని సైతం పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించారు. అయితే కాసేపటికే దాన్ని పోలీసులు నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది.
News September 14, 2024
తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!
భారత పర్యాటకానికి తలమానికమైన తాజ్‌మహల్‌లో నీరు కారుతోంది. ఆగ్రాలో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన డోమ్ నుంచి నీరు లీకవుతోందని పురావస్తు అధికారులు గుర్తించారు. అయితే పెద్దగా సమస్యలేవీ కనిపించలేదని, వెంట్రుకవాసి పరిమాణంలో ఓ బీటను గుర్తించామని తెలిపారు. డ్రోన్ సాయంతో దాన్ని నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే తగిన మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.