News May 11, 2024
హైదరాబాద్ మెట్రోకు L&T గుడ్‌బై?

HYD మెట్రో రైలు నిర్వహణ బాధ్యతల నుంచి 2026 తర్వాత తప్పుకోవాలని భావిస్తున్నట్లు L&T ప్రెసిడెంట్ శంకర్ రామన్ వెల్లడించారు. ‘ప్రస్తుత రైడర్‌షిప్ దృష్ట్యా మాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సగటున రోజుకు 4,80,000 మందే ప్రయాణిస్తున్నారు. ఫ్రీ బస్ స్కీమ్‌తో మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. నాన్ కోర్ బిజినెస్ నుంచి తప్పుకోవాలనుకోవడం కూడా మరో కారణం’ అని తెలిపారు.
Similar News
News February 16, 2025
IPL 2025: సీఎస్కే తొలి మ్యాచ్ ఎవరితో అంటే?

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఆడనున్నట్లు Espn Cricinfo పేర్కొంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచులో ఐదేసి సార్లు కప్పు గెలిచిన ఈ జట్లు పోటీపడతాయని తెలిపింది. కాగా ఆర్సీబీ VS కేకేఆర్ (ఈడెన్ గార్డెన్‌లో), SRH vs RR (HYDలో) తమ తొలి మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని చెప్పింది.
News February 16, 2025
మహిళా నిర్మాతపై విచారణకు కోర్టు ఆదేశాలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై ముంబైలోని ఓ కోర్టు విచారణకు ఆదేశించింది. ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్‌లో భారత జవాన్లను అవమానపరిచేలా సన్నివేశాలున్నాయని వికాస్ పాఠక్ అనే యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి యూనిఫామ్‌లో ఓ నటుడితో అభ్యంతరకర సన్నివేశాలు చేయించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేటు కోర్టు, ఏక్తాపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించింది.
News February 16, 2025
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.