News March 30, 2024
లక్నో భారీ స్కోర్ 199/8
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డికాక్(54) హాఫ్ సెంచరీ చేయగా కెప్టెన్ పూరన్(42) రాణించారు. చివర్లో కృణాల్ పాండ్య(43) మెరుపులతో లక్నో జట్టు 20 ఓవర్లలో 199/8 స్కోర్ నమోదు చేసింది. సామ్ కరన్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.
Similar News
News January 20, 2025
పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందో లేదో స్పష్టత రావాలి: DGP
AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కలకలంపై DGP ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ ఎగిరిందో లేదా స్పష్టత రావాల్సి ఉందని, సాయంత్రానికి విచారణ కొలిక్కి వస్తుందన్నారు. RSI మాత్రమే డ్రోన్ ఎగిరినట్టు చెబుతున్నారని వెల్లడించారు. పవన్ సాలూరు పర్యటనలో నకిలీ IPS అధికారి ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని DGP వివరించారు. ఆయన భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
News January 20, 2025
రాహుల్ గాంధీకి ఊరట కల్పించిన సుప్రీంకోర్టు
పరువునష్టం కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2018 నాటి కాంగ్రెస్ ప్లీనరీలో HM అమిత్ షా ‘హత్యకేసులో నిందితుడు’ అని RG ఆరోపించారు. దీంతో ఆయనపై BJP నేత నవీన్ ఝా దావా వేశారు. తన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవంటూ 2024 FEBలో రాహుల్ వేసిన క్వాష్ పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టేసింది. కేసుపై మరింత పరిశీలన అవసరమని నేడు సుప్రీంకోర్టు పేర్కొంది.
News January 20, 2025
ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే రంగరాజు ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపంతో పాపులర్ అయ్యారు. తర్వాత యజ్ఞం, సీమశాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్, మేడం సహా పలు సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.