News November 13, 2024
ఈనెల 30న ఓటీటీలోకి ‘లక్కీ భాస్కర్’?
దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన లక్కీ భాస్కర్ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది.
Similar News
News December 2, 2024
UNBELIEVABLE: బ్రేక్ చేయలేని రికార్డు!
క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదై, బద్దలవుతుంటాయి. ఎవ్వరూ అందుకోలేని రికార్డులూ ఉంటాయి. అందులో సచిన్ రికార్డులు ఫస్ట్. అయితే మరో భారత క్రికెటర్ కూడా ఎవరికీ సాధ్యంకాని ఓ రికార్డు నమోదు చేశారు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్‌పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ చేశారు. ఆ మ్యాచ్‌లో మొత్తం 32 ఓవర్లు వేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. తాజాగా WI బౌలర్ జేడెన్ సీల్స్ వరుసగా 6 మెయిడెన్స్ వేశారు.
News December 2, 2024
డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు
1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1912: దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1989: భారత దేశ 8వ ప్రధానిగా వీపీ సింగ్ నియామకం
1996: ఉమ్మడి ఏపీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
News December 2, 2024
హైదరాబాద్‌లో భారీ వర్షం
TG: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వాన పడింది.