News November 9, 2024
శంకర్‌తో కలిసి పనిచేయడం అదృష్టం: రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేర్కొన్నారు. లక్నోలో జరిగిన మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘డైరెక్టర్ శంకర్ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేయించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన్ను మిస్ అవుతున్నాం. నా గత సినిమాను లక్నో ప్రజలు ఆదరించారు. గేమ్ ఛేంజర్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 14, 2024
రైతు రుణాలు.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
రైతు రుణాలపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే <<14805545>>లోన్ లిమిట్ రూ.2 లక్షలకు<<>> పెంచగా జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడనుందని కేంద్రం పేర్కొంది.
News December 14, 2024
బన్నీకి రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది : RGV
హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైరయ్యారు. ‘తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ అందించి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అని RGV ట్వీట్ చేశారు.
News December 14, 2024
GREAT: సైకిల్‌పైనే 41,400Kms వెళ్లిన రంజిత్
సైకిల్‌పై పక్కూరికి వెళ్లేందుకే కష్టమనుకునే వారున్న రోజుల్లో వరంగల్(TG)కి చెందిన రంజిత్ నాలుగేళ్లలో 41,400 KMS ప్రయాణించారు. తన తండ్రి 2020లో మరణించగా, ప్రపంచాన్ని చుట్టిరావాలనే ఆయన కలను తాను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యారు. స్తోమత లేకపోవడంతో సైకిల్‌పైనే ఇప్పటివరకు 13 దేశాల్లో పర్యటించారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన AUSలో ఉండగా BGT మ్యాచుకు వెళ్లారు.