News January 8, 2025

TG జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం?

image

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు ఇంటర్ విద్యా కమిషనరేట్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 424 జూనియర్ కళాశాలల్లో లక్షన్నరకు పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. కాగా ఏపీలోని జూనియర్ కాలేజీల్లో ఇటీవలే ఈ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 24, 2025

ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్య నిషేధం

image

మధ్యప్రదేశ్(MP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ సహా 17 ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను సీఎం నొక్కి చెప్పారు. కాగా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది.

News January 24, 2025

RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ

image

AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

News January 24, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సీపీ కీలక వ్యాఖ్యలు

image

TG: మీర్‌పేట్‌లో భార్యను <<15227723>>దారుణంగా హత్య చేసిన ఘటన<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇది మిస్సింగ్ కేసుగానే ఉందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతోనూ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.