News July 11, 2024
స్మోక్ చేయని వారికీ లంగ్ క్యాన్సర్!

ఇండియాలోని లంగ్ క్యాన్సర్ పేషెంట్లలో ఎక్కువ మంది పొగతాగే అలవాటు లేనివారే ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. జన్యుపరంగా, గాలి కాలుష్యం వల్ల స్మోకింగ్ అలవాటు లేకున్నా చాలామందికి లంగ్ క్యాన్సర్ వస్తున్నట్లు తేల్చారు. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఈ క్యాన్సర్ వృద్ధి ఎక్కువగా ఉందని, 2025నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాగా లంగ్ క్యాన్సర్ పేషెంట్లలో చైనా టాప్‌లో ఉండగా భారత్ 4వ స్థానంలో ఉంది.
Similar News
News November 12, 2025
జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్ వార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?
News November 12, 2025
ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.
News November 12, 2025
రేపు విచారణ.. ఇవాళ క్షమాపణ!

TG: నాగార్జున ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ మరోసారి <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడం చర్చకు దారితీసింది. సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అందుకే ఆమె ఒకరోజు ముందు ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ‘సారీ’ని స్వీకరించి నాగార్జున కేసును వెనక్కి తీసుకుంటారా? లేక ముందుకే వెళ్తారా? అనేది రేపు తేలనుంది.


